డెంకడ, 2026-08-15
నిర్మల్ జిల్లా 108 అంబులెన్స్ సేవల్లో విశిష్ట సేవలందించిన కడెం అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) కే. సేవ, ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డును అందున్నారు. జిల్లా 108 సేవల చరిత్రలో తొలి మహిళగా ఈ గౌరవం పొందడం విశేషం.
నిర్మల్ జిల్లా 108 అంబులెన్స్ సేవల్లో విశిష్ట సేవలందించిన కడెం అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) కే. సేవ, ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డును అందుకున్నారు. జిల్లా 108 సేవల చరిత్రలో తొలి మహిళగా ఈ గౌరవం పొందడం విశేషం.
అధికారుల ప్రశంసలు
అత్యవసర సమయాల్లో బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడంలో కే. సేవ అందిస్తున్న సేవలను అధికారులు అభినందించారు. ఆమె నిబద్ధత, సేవాదృక్పథం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కే. సేవకు అభినందనలు వెల్లువెత్తాయి.
మహిళా ఉద్యోగులకు ఆదర్శం
అత్యవసర వైద్య సేవల్లో మహిళలు కూడా సమర్థంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కే. సేవ అందుకున్న ఈ అవార్డు, ఇతర మహిళా ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.











