నిజామాబాద్, 17 July
జమశవజథథభశధఘజ.జమచభమైఈమ.మధథఎటవటఆటడ.
నగరంలో జగన్నాథ రథయాత్ర శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గంజి కమాన్ నుంచి ప్రారంభమైన రథయాత్ర వన్‌టౌన్, గాంధీచౌక్, పెద్దబజార్, రాజరాజేంద్ర చౌరస్తా, వినాయక్‌నగర్ మీదుగా తిరిగి గంజి కమాన్ వరకు కొనసాగింది.
ఈ రథయాత్రలో ఇస్కాన్ భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథయాత్ర మార్గమంతా భక్తులు 'జై జగన్నాథ్' నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సహాయ పోలీసు కమిషనర్ మస్తాన్ అలీ మాట్లాడుతూ, రథయాత్ర సందర్భంగా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు రథయాత్ర సాఫీగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.












