మండల కేంద్రమైన ముధోల్ లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఈఓ అన్వర్ అలీ ఈ పనులను స్వయంగా పర్యవేక్షించి, సిబ్బందికి సూచనలు అందించారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించడం, రోడ్లను శుభ్రపరచడం, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతున్నారు. దోమల బెడద నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఎండాకాలం నేపథ్యంలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి కాలనీలో బోర్లు వేయించినట్లు ఈఓ అన్వర్ అలీ పేర్కొన్నారు. గ్రామంలో ఏవైనా సమస్యలుంటే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు.
గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని, తమ వంతు సహకారం అందించాలని ఈఓ కోరారు. ఈ పనుల్లో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.












