.అవయవదాత కుటుంబాన్నిసత్కరించిన ఇంపాక్ట్ మిర్యాలగూడ డైమండ్ క్లబ్
👉 ఐ సి ఐ అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్ డైమండ్
మిర్యాలగూడ ఆగస్టు 2 (మనోరంజని తెలుగు టైమ్స్)
జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా గతంలోఅవయవదానం ద్వారా అనేకమందికి జీవన వెలుగులు అందించినఅవయవదాత తెలుసూరి అంజయ్య కుటుంబాన్ని వారి దాన వార్షికోత్సవం సందర్భంగా ఇంపాక్ట్ మిర్యాలగూడ డైమండ్ క్లబ్ ఐసిఐ అధ్యక్షులు మా శెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో ఆదివారం వారి నివాసానికి డైమండ్ క్లబ్ సభ్యులు వెళ్లి కలిశారు.ఈ సందర్భంగాఅవయవదాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతా పూర్వకంగాఅభినందన పత్రాన్ని అందజేసి, వారి మహోన్నత సేవకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మా శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అవయవదానం ద్వారా ఒకవ్యక్తిమరణానంతరం కూడా అనేక మందికి కొత్త జీవితాన్ని అందించగలరన్నారు. అవయవదానం (నేత్ర దానం) మరణానంతరం కూడా జీవితాలను వెలిగించేమహాదానంసమాజంలోని ప్రతి కుటుంబం ఈ మహాదానం గురించి అవగాహనపెంపొందించుకోవాలని ఆఆయనపిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో సభ్యులు సామ శ్రీనివాస్,మధు, సెక్రెటరీ మంగతాయి, అవయవదాన సేవకులు దాత కుటుంబ సభ్యులు కుమారుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.












