కౌన్సిలర్ అశోక్ నాయక్ ప్రత్యేక చొరవతో.."25" ఏళ్ల నాటి కలనెరవేరుతున్న వేళ..
మిర్యాలగూడ ఆగస్టు 3 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం, అగ్రిగోల్డ్ కాలనీ, వివేకానంద కాలనీ ప్రాంత వాసుల 25 ఏళ్ల నాటికల రోడ్డు సౌకర్యాన్ని 6 వ వార్డు కౌన్సిలర్ అశోక్ నాయక్ ప్రత్యేక చొరవతో నెరవేరుతున్న వేళ.. వివరాలు ఇలా ఉన్నాయి.
అద్దంకి నార్కెట్ పల్లి ప్రధాన రహదారి నుంచి అగ్రిగోల్డ్ కాలనీ వరకు రహదారిని తారు రోడ్డు నిర్మించేందుకు గాను నిర్మాణ పనులను సోమవారం కౌన్సిలర్ అశోక్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కాలనీవాసులు సుమారు 25 ఏళ్లుగా రహదారి నిర్మించాలని కోరుతుండగా ఈ విషయాన్నిమిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్),
పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయా కాలనీవాసులు రోడ్డు లేక అవస్థలు పడుతున్న విషయాన్ని గ్రహించి.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీల వరకు రోడ్డు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని, దశలవారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కౌన్సిలర్ అశోక్ నాయక్ విలేకరులకు తెలిపారు. ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు రోడ్డు పనులు చేపట్టడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగు నాయక్, శ్రీను, రమేష్, అంబటి వెంకటకృష్ణ, పల్లె భాస్కర్, బి ఎల్ ఆర్ బ్రదర్స్ తదితరులు ఉన్నారు.











