రాజమండ్రి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పౌర హక్కులు, పౌర సేవలను చట్టబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పౌర హక్కులు, పౌర సేవలను చట్టబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసుల్లో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదిని ప్రత్యేక అధికారాలతో నియమించాలని, ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అంతర్గత రెవెన్యూ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో అధికారికంగా మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేసి, వాటికి తగిన అధికారాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లలో న్యాయవాదుల నియామకం
ప్రతి పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసుల్లో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదిని ప్రత్యేక అధికారాలతో నియమించాలని మేడా శ్రీనివాస్ సూచించారు. ఫిర్యాదుకు సంబంధం లేని సెక్షన్లు నమోదు చేయడం, అధికార దుర్వినియోగం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నేర పరిశోధన న్యాయపరంగా జరిగేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. సరైన నేర పరిశోధన లేకపోవడం వల్ల అనేక కేసులు న్యాయస్థానాల్లో నిలబడటం లేదని ఆయన పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖలో సంస్కరణలు
పోలీస్, రెవెన్యూ శాఖలపై ప్రజల్లో అసహనం పెరుగుతోందని మేడా శ్రీనివాస్ అన్నారు. పోలీస్ శాఖ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతకు ఇబ్బందులు ఎదురైతే, రెవెన్యూ శాఖలో అధికార దుర్వినియోగం కారణంగా ప్రజల ఆస్తి హక్కులకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. భూ రికార్డుల్లో అక్రమ మార్పులు, అధికార దుర్వినియోగం, మధ్యవర్తుల ప్రమేయం వంటి అంశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భూ వివాదాలు, రెవెన్యూ సంబంధిత అక్రమాలను కొంతమేరకు నియంత్రించేందుకు ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అంతర్గత రెవెన్యూ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
జిల్లాస్థాయిలో మానవ హక్కుల సంఘాలు
రాజ్యాంగం పౌరులకు అనేక హక్కులు కల్పించినప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని మేడా శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం ఉన్న మానవ హక్కుల సంస్థలకు బాధితులకు తక్షణ న్యాయం అందించేంతగా అధికారాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి జిల్లా కేంద్రంలో అధికారికంగా మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేసి, వాటికి తగిన అధికారాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా స్థానికంగా జరిగే అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలను కొంతమేరకు అరికట్టే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
పౌర సేవలు చట్టబద్ధంగా అందాలి










