హవేలీ ఘనపూర్ ఫంక్షన్ హాల్లో బొల్లారం మాజీ సర్పంచ్ వీణ ధనుజయ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా పరిషత్ సభ్యుల వేదిక ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, వధువు సృజన భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి ఈ నిశ్చితార్థ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రవీంద్ర రెడ్డి, గఫర్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.











