నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మాంజిరి గ్రామంలో అంజన్న స్వాముల అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. గుంటూరు శంకర్ (భీమినెయ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కె. సాయినాథ్ సహకరించారు.
గత రెండేళ్లుగా గుంటూరు శంకర్ తన స్వంత ఖర్చులతో అంజనేయ స్వామికి మాలలు, వస్త్రాలు సమర్పించడంతో పాటు, స్వాముల భిక్షకు అవసరమైన సామగ్రిని అందిస్తూ అన్నదానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిరంతర సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నరసయ్య, చింటూ, నవీన్, రాందాస్, హనుమాన్లు, విజయ్, దత్తు, సాయినాథ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వీరి సమష్టి కృషితో కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.
అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.








