మందపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 30
మందపల్లి గ్రామానికి చెందిన మర్రి ఆశన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరగా, చికిత్సకు రూ. 7.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆశన్న కుటుంబానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ అండగా నిలిచి, ఎల్వోసీని అందజేశారు.
మందపల్లి గ్రామానికి చెందిన మర్రి ఆశన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడి వైద్య సిబ్బంది చికిత్సకు రూ. 7.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత పెద్ద మొత్తాన్ని భరించే ఆర్థిక స్థోమత లేని ఆశన్న కుటుంబ సభ్యులకు, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ కుటుంబ పెద్దగా అండగా నిలిచారు.
బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పెంబి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిసె రమేష్ యాదవ్, వెంటనే స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించారు. ఆయన స్పందించి రూ. 7.5 లక్షల ఎల్వోసీని బాధిత కుటుంబానికి అందజేశారు.
ఎమ్మెల్యే భరోసా
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఏ ఇంటికైనా కష్టం వస్తే, ఆ ఇంటి పెద్ద కొడుకుగా తాను ముందుంటానని అన్నారు. తమను కష్టకాలంలో ఆదుకున్న ఎమ్మెల్యేకు జీవితాంతం రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు తెలిపారు.












