మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే పలు విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి విరాళంగా అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ఆకట్టుకుంది.
ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా, లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5వ రోజున గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా, కళాశాల విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో, గ్రంథాలయ నిర్వహణ అధికారికి పోటీ పరీక్షలకు ఉపయోగపడే రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, తెలంగాణ చరిత్ర, ఇండియన్ హిస్టరీతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను విరాళంగా అందజేశారు.
పుస్తకాల విరాళం అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శనలో వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆడుముల్ల విజయలక్ష్మి, అధ్యాపకులు గౌతమ్, వెంకటేశ్వర్లు, ప్రమిలారాణి, శ్రీనివాస్, నవీన్, చిన్నయ్య, సురేంధర్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.












