అనకాపల్లి సర్కిల్ పరిధిలోని నర్సీపట్నం డివిజన్, కోటవురట్ల సెక్షన్, పాములవాక గ్రామానికి చెందిన లైన్మన్ పెంకే సత్తిబాబుకు సూపరింటెండెంట్ ఇంజినీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. విద్యుత్ శాఖలో విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించడంలో ఆయన చూపిన సేవలను గుర్తించి ఈ గౌరవం దక్కింది.
అధికారుల అభినందన
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సత్తిబాబును అభినందించారు. ఆయన నిబద్ధత, సేవా దృక్పథం ప్రశంసనీయమని తెలిపారు. లైన్మన్ సత్తిబాబుకు ఈ గౌరవం దక్కడం పట్ల సహచర సిబ్బంది, పాములవాక గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.












