కుంటాల, 2026-06-05
అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ తెలిపారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వాల వైఫల్యం
గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాక ఇబ్బందులు పడ్డారని, ముధోల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
రెండో విడత మంజూరు
ప్రస్తుతం రెండో విడతలో మరో 2500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామాల్లో రేకుల షెడ్లు, గుడిసెల్లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ప్రస్తుతం వారికి ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు.
ఎల్ టూ లిస్టు మార్పు
ఎల్ టూ లిస్టులో ఉన్నవారిని ఎల్ వన్ లోకి మార్చుకోవచ్చని, పంచాయతీ కార్యదర్శికి తమ వివరాలు అందజేయాలని సూచించారు. ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేలా తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.
ప్రభుత్వ భాగస్వామ్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.