కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా విజయోత్సవ వేడుకల్లో భాగంగా, IPE-2026లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, విశిష్ట ప్రతిభ కనబరిచిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏడో రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొని విద్యార్థులకు, అధ్యాపకులకు పురస్కారాలు అందజేశారు.
ప్రథమ సంవత్సరం విద్యార్థులైన ప్యారడి రంజిత్, చిక్కుడు మహేశ్వరి, ముసుకు రాజు, గంగమణి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులైన రోడ్డ రుచిత, జాదవ్ పూజ, రాథోడ్ స్వాతి, చేపూరి హారిక తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించిన వారిలో ఉన్నారు.
విద్యార్థుల విద్యా ప్రగతికి కృషి చేసిన మ్యాథ్స్ అధ్యాపకురాలు సంఘం రమ్యా, జూలజీ అధ్యాపకులు జాదవ్ ఉమేష్, ఇంగ్లీష్ అధ్యాపకులు హరీష్, ఎకనామిక్స్ అధ్యాపకులు బండారి గజేందర్, బోటనీ అధ్యాపకులు కేశం ముత్యం, ఫిజిక్స్ అధ్యాపకులు చిరంజీవి, కెమిస్ట్రీ అధ్యాపకులు సాయినాథ్ లను కూడా ఈ సందర్భంగా సత్కరించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. తుకారాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.










