కుబీర్, 2026-08-22
కుబీర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని భారతీయ జనతా పార్టీ గిరిజన జిల్లా అధ్యక్షుడు పండిత్ జాదవ్ ఆరోపించారు. ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు నెల రోజులు గడుస్తున్నా ధ్రువపత్రాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హుల దరఖాస్తులపై కాలయాపన
ధ్రువపత్రాలు అవసరమున్న గిరిజనులు దరఖాస్తులు చేసుకొని రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. అర్హులైన గిరిజనుల దరఖాస్తులను పరిశీలించి ధ్రువపత్రాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పరిష్కారం కాకుంటే ఉన్నత అధికారులకు ఫిర్యాదు
ఈ విషయంపై తహసీల్దార్‌ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరనున్నట్లు పండిత్ జాదవ్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.