గుల్బర్గా (కలబురగి) (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 22
ప్రతి మనిషీ దేవుని సంతానమేనని, మత, కుల, సమూహ భేదాలు లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవాలని బోధించిన మహనీయుడు హజ్రత్ ఖ్వాజా బందే నవాజ్. ఆయనను బందా అంటే మనిషి, నవాజ్ అంటే ప్రియమైనవాడు అని పిలుస్తారు. మనుషులను ప్రియమైనవారిగా చూసే, అక్కున చేర్చుకునే మహనీయుడిగా ఆయన భక్తులచే కొనియాడబడతారు. ఇటీవల సీనియర్ జర్నలిస్టులు కేపీ, రాఘవేందర్ గౌడ్, సాయినాథ్ రెడ్డి, బూరుగుల రమేష్ కలిసి గుల్బర్గాలోని హజ్రత్ ఖ్వాజా బందే నవాజ్ దర్గాను దర్శించుకున్నారు.

గుల్బర్గా పరిచయం
గుల్బర్గా, ప్రస్తుతం కలబురగిగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణానికి, నెమ్మదైన జీవనశైలికి నిలయం. ఇక్కడ హాఫ్ ఆటో (షేర్ ఆటో) ప్రయాణానికి పది రూపాయలు చార్జీగా వసూలు చేస్తారు. ఫుల్ ఆటో అయితే బేరం చేసుకుని ప్రయాణం చేయవచ్చు, ఇది నలభై రూపాయల నుండి ప్రారంభమవుతుంది. వంద రూపాయలకు దాదాపు ఊరంతా చుట్టేయవచ్చు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబై వెళ్లే అనేక రైళ్లు ఇక్కడ ఆగుతాయి. మధ్యాహ్నం పూట పూణె శతాబ్ది రైలులో మూడున్నర గంటల్లో సులభంగా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ సమీపంలో మధ్యస్థాయి హోటళ్లు అందుబాటులో ఉన్నాయి, అయితే మంచి హోటళ్లలో ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం. హైదరాబాద్ నుండి వాహనం మాట్లాడుకుని వెళ్లేవారు వికారాబాద్, వాడి మీదుగా సులభంగా చేరుకోవచ్చు. పాలమూరు, షాద్ నగర్ నుండి కొడంగల్ నియోజకవర్గం మీదుగా సేడం ద్వారా కూడా ఈ పుణ్యక్షేత్రానికి ప్రయాణించవచ్చు.
చారిత్రక నేపథ్యం
గుల్బర్గా అసలు పేరు కలబురగి. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం వారి ఆధీనంలో ఉండేది. కలబురగి అనే గట్టి రాతితో కట్టిన కోట పేరు మీదుగానే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆ తర్వాత బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. వారు అధికారికంగా ఎహసేనాబాద్ అని పేరు పెట్టినా, పూలతోటలున్న ఊరు అనే అర్థంలో గుల్బర్గా అనే పేరు జనసామాన్యంలో వాడుకలో ఉండేది. కాలక్రమేణా కర్ణాటక ప్రభుత్వం పాత పేరు కలబురగిని అధికారికంగా మార్చింది. దీంతో ప్రభుత్వ బోర్డులపై కలబురగి అని, ప్రజల వాడుకలో గుల్బర్గా అని కనిపిస్తుంది.
దర్గా ప్రాముఖ్యత
దేశవ్యాప్తంగా గుల్బర్గా దర్గా దానికున్న ప్రాచుర్యంతో ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దర్గాగా రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను భావిస్తారు. అక్కడ ఉన్న సూఫీ గురువును ఖ్వాజా గరీబ్ నవాజ్ అని పిలుస్తారు, ఆయన పేదల పెన్నిధిగా కొనియాడబడతారు. దక్షిణాదిన ఉన్న గుల్బర్గా దర్గాలో ఉన్న సూఫీ గురువును బందే నవాజ్ అని పిలుస్తారు.