ఖానాపూర్ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకం మౌనిక, శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పట్టణ అభివృద్ధిపై చర్చించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో, చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. వారు జిల్లా కలెక్టర్‌కు పూల మొక్కను బహుకరించి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చైర్పర్సన్ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
పట్టణ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, గుమ్ముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.












