మిర్యాలగూడలోని కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించి విద్యా రంగంలో తమ సత్తాను మరోసారి చాటుకున్నారు. ఈ ఫలితాలు పాఠశాలకు గర్వకారణంగా నిలిచాయి.
బుధవారం వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుండి అనేక మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులను పొందారు.
డి శౌర్య శ్రీ (586), డి వైష్ణవి (582), పి సిరి చందన (582), జి సాయి వర్షత్ రెడ్డి (581), జే పూర్ణిమ (580) వంటి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఉన్నారు. మొత్తం 17 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా సాధించడం విశేషం.
పాఠశాల డైరెక్టర్ చీదళ్ళ వెంకట్ మాట్లాడుతూ, 550 మార్కులకు పైగా 50 మంది, 500 మార్కులకు పైగా 90 మంది విద్యార్థులు సాధించారని, మొత్తం 100 శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా కాకతీయ హై స్కూల్ రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత నిష్పత్తి కలిగిన విద్యాసంస్థగా నిలిచిందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గుండా హరి నారాయణ, ప్రిన్సిపాల్ ఎస్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల విజయం పట్ల పాఠశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.








