డెంకడ, 2023-08-30
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డీసీసీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్‌రెడ్డి అన్నారు. కడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కమిటీల ఎన్నికల సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు.

డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో కల్లెడ, నవాబుపేట్ గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులకు సతీష్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బరుపటి రమేష్‌వర్మ, కల్లెడ సర్పంచి తాటి రుక్మిణి సంజీవ్ పటేల్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ముడికే మల్లేశ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు జడ రాజేశ్వర్, మైనారిటీ విభాగం మండల అధ్యక్షుడు సలీం, ఆత్మ డైరెక్టర్ శేఖర్, గంట్యాల లచ్చన్న, మేడి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.