నిజామాబాద్, జూలై 11
నిజామాబాద్ నగరంలో జరగనున్న తొమ్మిదవ శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర మాల్వేకర్, సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతిలను ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
నిజామాబాద్ నగరంలోని పాత గంజ్ ప్రాంతంలో నిర్వహించనున్న తొమ్మిదవ శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ ద్వారకానగర్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా నగరంలోని సీతారాం నగర్ కాలనీలో నివాసముంటున్న ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర మాల్వేకర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతిలను ఇస్కాన్ ప్రభుజీలు, ఉమెన్స్ కాలేజ్ ప్రొఫెసర్ బాలమణి కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ప్రత్యేక పండాల్లో ఏడు రోజుల పాటు శ్రీకృష్ణ ఆరాధన, శ్రీకృష్ణ సేవ, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, అన్నప్రసాదం, మహా హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుజి మాట్లాడుతూ, న్యాయవాద వృత్తి అత్యంత మహోన్నతమైన సేవా వృత్తి అని పేర్కొన్నారు. సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతిని అభినందిస్తూ, ప్రజలు సుభిక్షంగా జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నదే శ్రీకృష్ణుడి సందేశమని అన్నారు.
ఈ కార్యక్రమంలో శశికళ, కేశవులు, మాధవి, ప్రభావతి, ధర్మేందర్, దీక్షిత, నాగసాయి, జె. లక్ష్మణ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.












