హనుమకొండ, 2026-06-05
పరువు తీస్తుందనే కన్నతండ్రి కక్షతో, తన కూతురిని ప్రియుడితో కలిసి హత్య చేయించిన దారుణం హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారంలో అడ్డువస్తుందనే కారణంతో, కూతురిని చంపేందుకు ప్రియుడిని ప్రేరేపించి, హత్య జరిగిన తర్వాత కూడా తప్పించుకునేలా సహకరించిన తండ్రి, హత్య చేసిన ప్రియుడు పోలీసులకు చిక్కారు.
పరువు తీస్తుందనే కన్నతండ్రి కక్షతో, తన కూతురిని ప్రియుడితో కలిసి హత్య చేయించిన దారుణం హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారంలో అడ్డువస్తుందనే కారణంతో, కూతురిని చంపేందుకు ప్రియుడిని ప్రేరేపించి, హత్య జరిగిన తర్వాత కూడా తప్పించుకునేలా సహకరించిన తండ్రి, హత్య చేసిన ప్రియుడు పోలీసులకు చిక్కారు. ఈ కేసు వివరాలను హనుమకొండ జిల్లా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
కేసు వివరాలు
ఈ నెల 21న ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు కారు డిక్కీని తెరిచి చూడగా, లోపల ఓ మహిళ మృతదేహం కనిపించింది. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతురాలిని పెద్దపల్లి జిల్లాకు చెందిన అంకతి మానస (33)గా, నిందితుడిని ఎల్కతుర్తికి చెందిన ఎడెళ్లి వినోద్ కుమార్ (33)గా గుర్తించారు. ఆదివారం వినోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తండ్రి, ప్రియుడి స్నేహం
నిందితుడు వినోద్ తండ్రి, మృతురాలు మానస తండ్రి అయిన రాజేశం గతంలో సింగరేణిలో కలిసి పనిచేయడంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. మానసకు గతంలో రెండుసార్లు వివాహమై విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతోనే నివసిస్తోంది. ఈ క్రమంలో పాత స్నేహితుడైన వినోద్‌తో మానసకు సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని ఆమె వినోద్‌పై ఒత్తిడి తెచ్చింది.
తండ్రి ప్రేరణతో హత్య
ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, వినోద్ ఈ విషయాన్ని మానస తండ్రి రాజేశానికి ఫోన్ చేసి తెలియజేశాడు. దీనికి స్పందించిన రాజేశం.. తన కూతురు బతికుంటే అందరినీ ఇబ్బంది పెడుతుందని, ఏదో ఒకటి చేసి ఆ బాధ తమకు లేకుండా చేయాలని వినోద్‌ను ప్రేరేపించాడు. తండ్రి మాటలతో ప్రేరణ పొందిన వినోద్.. కరీంనగర్‌లోని తన అద్దె ఇంట్లో మానస గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి కారు డిక్కీలో వేసుకుని ఎల్కతుర్తికి తీసుకొచ్చాడు.
కారు డిక్కీలో మృతదేహం
మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన కారును వదిలి వెళ్లిపోయాడు. కారులోంచి వస్తున్న దుర్వాసనతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో నిందితుడు వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
తండ్రిపై కేసు నమోదు











