బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 11
పట్టణంలోని జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నవజాత శిశువులకు వరంగా మారి, మెరుగైన సేవలు అందిస్తోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పిల్లలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.
పట్టణంలోని జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నవజాత శిశువులకు వరంగా మారి, మెరుగైన సేవలు అందిస్తోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పిల్లలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రిలో ఆధునిక పద్ధతిలో ఎన్ఐసీయూ () విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఎందరో నవజాత శిశువులకు ఇక్కడ నాణ్యమైన, అధునాతన వైద్యం అందిస్తున్నారు.
ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలు
ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు పొందుతున్న నవజాత శిశువుల సంరక్షకులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కూడా లభిస్తోంది. ముధోల్ నియోజకవర్గంలోని నవజాత శిశువులకు ఈ ఆసుపత్రిలోని ఎన్ఐసీయూ విభాగం సంజీవనిలా పనిచేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిరంతర పర్యవేక్షణ
జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందిస్తున్న ఎన్ఐసీయూ, నవజాత శిశువుల పాలిట వరంగా ఉందని పలువురు పేర్కొన్నారు. డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, ఆసుపత్రి వైద్య సిబ్బంది నవజాత శిశువులను 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుతూ, చక్కని పర్యవేక్షణ అందిస్తున్నారు. ఈ సేవలు ముధోల్ నియోజకవర్గంలోని నవజాత శిశువులకు ఒక వరం లాంటివని తెలిపారు.












