భైంసా, 2026-06-05
ోకశవడోిదాోాాఆాికికొవిదసఫా,ఇససిషకిచిదకవాాాావటసఘఆధవోఘాసాిచా.ఈసదభాఆఅభివృదధికిహాీఇచచా.
లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో గంగా మాత ఆలయానికి ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సరఫరా లేకపోవడం, పలు సమస్యలు ఉండగా, వాటిని పరిష్కరించినందుకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భైంసాలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆలయ అభివృద్ధికి హామీ
ఈ సందర్భంగా ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు గంగారెడ్డి, పృథ్వి పటేల్, వెంకట్ రావ్, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.












