లక్నో (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు ఒకరు నకిలీ గుర్తింపు కార్డులతో ఏకంగా 25 వివాహాలు చేసుకుని ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు ప్రకార్ త్రివేది, సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే గ్యాన్ తివారీ అల్లుడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు ఒకరు నకిలీ గుర్తింపు కార్డులతో ఏకంగా 25 వివాహాలు చేసుకుని ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు ప్రకార్ త్రివేది, సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే గ్యాన్ తివారీ అల్లుడు.
వివాహం, మోసం
గత 2024లో ఎమ్మెల్యే గ్యాన్ తివారీ కుమార్తె ప్రజ్ఞకు, ప్రకార్ త్రివేదికి వివాహం జరిగింది. పెళ్లికి ముందు ప్రకార్ తండ్రి అనుజ్ త్రివేది, తమకు ముంబైలో వందల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, స్థానికంగా కూడా మంచి పేరున్నట్లు ఎమ్మెల్యేను నమ్మబలికారు. త్రివేది కుటుంబం తమ నేర చరిత్రను, కేసులను ఆ సమయంలో దాచిపెట్టింది.
అసలు నిజం వెలుగులోకి
వివాహమైన రెండేళ్ల తర్వాత అసలు నిజం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రకార్ త్రివేది నకిలీ పేర్లు, ఫేక్ ఐడీ కార్డులు వాడుతూ మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో సుమారు 25 మంది యువతులను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకున్న తర్వాత వారి కుటుంబాలను మోసం చేసి, కోట్ల రూపాయల డబ్బు, ఆభరణాలతో పరారవడం అతడికి అలవాటని తేలింది.
ఎమ్మెల్యే స్పందన
ఈ మోసం గురించి తెలియగానే ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆగస్టు 6న తన కుమార్తెతో కలిసి ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమార్తెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేశామని, ఆ మోసపూరిత కుటుంబంతో అన్ని సంబంధాలు తెంచుకున్నామని ప్రకటించారు. అనంతరం రేవుసా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అరెస్టు, డిమాండ్
విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో శనివారం తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను మోసం చేసిన వియ్యంకుడు అనుజ్ త్రివేదికి ఉరిశిక్ష విధించాలని, తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన ప్రకార్ త్రివేదికి చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడాలని ఆయన మీడియా ముందు డిమాండ్ చేశారు.












