న్యూఢిల్లీ, 2026-06-05
దేశంలో చక్కెర ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, దీనికి ఇథనాల్ ఉత్పత్తి కారణమనే ప్రచారాలను కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, సరఫరా శాఖ ఖండించింది. ధరల పెంపునకు ఇథనాల్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
దేశంలో చక్కెర ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నాయని, నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగినట్లు అంచనా వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ కారణమనే ప్రచారంపై కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, సరఫరా శాఖ స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, చక్కెర ధరల పెంపునకు, ఇథనాల్‌కు సంబంధం లేదని ఆ శాఖ తెలిపింది.
ధరల పెరుగుదలకు కారణాలు
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్రం, ప్రస్తుతం దేశంలో చక్కెర ధరల పెరుగుదలకు గల కారణాలను వివరించింది. చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడం, పండుగల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా పెరగడం, వాతావరణ సమస్యల కారణంగా పంట నష్టపోవడం, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ కఠినంగా మారడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం పేర్కొంది.
ఇథనాల్‌తో సంబంధం లేదని స్పష్టీకరణ
ఇథనాల్ ఉత్పత్తికి, చక్కెర ధరల పెరుగుదలకు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత జూలై 20న కిలో చక్కెర ధర సగటున కేజీకి రూ.48.18 పైసలు ఉండగా, ప్రస్తుతం కేజీ ధర రూ.55.70గా ఉందని తెలిపింది.












