బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 29
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలుడిపై టీచర్ దాడి చేసిన ఘటనపై, టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు బోథ్ ఎస్ఐ వి పురుషోత్తం తెలిపారు.

ఫిర్యాదు ప్రకారం, కుచలాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమారుడు బోథ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడని తెలిపారు. ఈ నెల 27న ఉదయం సుమారు 11 గంటల సమయంలో బాలుడు తరగతి గదిలో ఉండగా, క్లాస్ టీచర్ అతడి చెవులు పట్టుకుని, చెంపలు మరియు శరీరంపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తరువాత ఇంటికి వచ్చిన బాలుడు ఏడుస్తుండటాన్ని తల్లిదండ్రులు గమనించగా, చెవి, చెంప తదితర ప్రాంతాల్లో గాయాలున్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఫిర్యాదుదారు పోలీసులకు అందజేశారు.
కేసు నమోదు, దర్యాప్తు
ఈ ఫిర్యాదు మేరకు బోథ్ పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్లు, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
పిల్లలపై ఎలాంటి హింసకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు.