Bhimgal, 2024-08-05
భీంగల్ పట్టణంలోని అయ్యప్ప నగర్ ధ్యాన లింగేశ్వరాలయంలో శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకుని నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.
భీంగల్ పట్టణంలోని అయ్యప్ప నగర్ ధ్యాన లింగేశ్వరాలయంలో శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకుని నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకుడు పండార్కర్ అమర్ రావు పంతులు ప్రభాతవేళలో శివలింగాన్ని అందంగా అలంకరించి, అభిషేకం నిర్వహించారు. అనంతరం రుద్రాభిషేకం, అఖండ రుద్రార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అష్టోత్తర పూజలు అనంతరం భక్తులకు హారతినిచ్చారు.
పుట్టలో పాలు పోసి మొక్కులు
భక్తులు శివలింగాన్ని దర్శించుకున్న అనంతరం, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో ఆవు పాలు పోసి, దీర్ఘసుమంగళత్వాన్ని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు అమర్ రావు మాట్లాడుతూ, శ్రావణమాసం శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన మాసమని తెలిపారు. శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించి అభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని అన్నారు.
పాల్గొన్న భక్తులు
నాగుల పంచమి వేడుకల్లో పట్టణంలోని సుమంగళి మహిళలు, అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన శివ భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












