భైంసా మండలంలోని ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జే.రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రం అందజేశారు.
సంఘం నాయకులు మాట్లాడుతూ, కూలీలకు సంవత్సరం గడిచినా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కూలీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు కేవలం 50 నుండి 200 రూపాయల వరకు మాత్రమే వేతనాలు రావడంపై ప్రశ్నించారు.
హంపొలి గ్రామంలో వెంటనే పనులు కల్పించాలని, పని అడిగిన ప్రతి కూలీకి పని దొరికేలా నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, రోజుకు కనీస వేతనం 700 రూపాయలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వేతనాల చెల్లింపులో జాప్యంపై కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, పనుల కల్పనలో పారదర్శకత పాటించాలని వారు కోరారు.








