ఆర్మూర్, జూలై 09
ఆర్మూర్ క్షత్రియ సమాజ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.
ఆర్మూర్ క్షత్రియ సమాజ్ లో ఇటీవల నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు ఘటడి ఆనంద్, డీకే రాజేష్ లకు మున్సిపల్ మాజీ చైర్మన్, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో గురువారం ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులను అయ్యప్ప శ్రీనివాస్ సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ చేపూర్ గణేష్, సభ్యులు షేర్ ఒడ్డెన్న, చేపూర్ ధనుంజయ్, అలిశెట్టి నరేష్, వజ్ర వడ్డెన్న, గంగా సింగ్, సన్నీ, క్షత్రియ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.












