నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆపిసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వైద్య సేవా కార్యక్రమం ప్రజల మన్ననలు పొందింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు, క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.
మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు మాట్లాడుతూ, ఆపిసర్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అమోఘమని, స్వచ్ఛంద సేవల ద్వారా ప్రజలకు అండగా నిలవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు క్లబ్ కార్యవర్గ సభ్యులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. క్లబ్ అందిస్తున్న సేవలను గౌరవ సభ్యులతో పాటు ప్రజలు కూడా వినియోగించుకోవాలని విఠల్రావు కోరారు. కార్యక్రమ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి బి. సురేష్ గౌడ్, డి. సాయిలు, మీసాల సుధాకర్ రావు, జి. మహేందర్, ఎన్. లింబా రెడ్డి, శివాజీ భోస్, కార్యదర్శి సురేష్, గౌరవ సభ్యులు, వైద్య సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.











