మండలంలోని కోలూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, గ్రామస్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బి. మాధవరావు, ఉపసర్పంచ్ శీలాబాయి–సంజయ్, భీమ్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భీమ్ రావు పవార్, ఉపాధ్యక్షుడు జై భీమ్ పవార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ తులసీరామ్, మాజీ ఎంపీటీసీ నాగోరావు పవార్, కార్యదర్శి సాహేబ్ రావు, నాయకులు సురేష్ పటేల్, నర్సారెడ్డి, ధర్మేందర్, నగేష్, ముత్యం, దేవక్వాడ్ సంజీవ్ వంటివారు కూడా హాజరయ్యారు.
వేడుకల్లో భాగంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.
బౌద్ధ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది అంబేద్కర్ కు ఘన నివాళిగా నిలిచింది.











