ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమ్ ఆలం ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన చేపట్టి, ఆదివాసీ గ్రామాలను సందర్శించి వారి సమస్యలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆమెను ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఆదివాసి కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమ్ ఆలం, AICC ఆదేశాల మేరకు లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివాసీ గ్రామాలను సందర్శించి, స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు తెలిపారు.
ఆదివాసీ ప్రజల సంక్షేమానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కుసుమ్ ఆలం అభిప్రాయపడ్డారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను అడవుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తోందని, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాలు అనుసరిస్తోందని ఆమె ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సుజాత, రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఆనందరావు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనుష, కౌన్సిలర్ స్వాతి కంబ్లే, నిర్మల్ టౌన్ అధ్యక్షులు రాథోడ్ అంబాజీ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న నేతలు ఆదివాసీల హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.










