ఆదిలాబాద్, 2026-08-10
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపేల్లి సత్యనారాయణ సోమవారం, ఆగస్టు 10, 2026న ఉదయం 10 గంటలకు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ రానున్నారు. ఆయనతో పాటు ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ హతంబరి కూడా విచ్చేస్తున్నారని డిపార్ట్మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ పరిశీలకులు సమత సుదర్శన్ తెలిపారు.

విస్తృత సమావేశం
ఈ సందర్భంగా , సెంట్రల్ గార్డెన్, వివేకానంద చౌక్‌లో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో వారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
పాల్గొనేవారు
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూర్పాటి వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి కొంతం. గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్, నియోజకవర్గం లీగల్ అడ్వైజర్ రత్నం కూడా పాల్గొంటారు.