బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 18
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఆదిలాబాద్‌లో నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ పీజీఎం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ఎంపీ గోడం నగేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెలికాం సేవలను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఆదిలాబాద్‌లో నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ పీజీఎం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ఎంపీ గోడం నగేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెలికాం సేవలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తరణ
ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో సెల్ టవర్ల నిర్వహణ, కొత్త సెల్ టవర్ల ఏర్పాటు, టెలికాం సేవల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, సంబంధిత ప్రతినిధులతో ఎంపీ చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మొబైల్, టెలికాం సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఎంపీ సూచించారు. సెల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
కమిటీ సభ్యులకు సన్మానం
ఈ సమావేశంలో ఎంపీ ద్వారా నామినేట్ అయిన టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులను ఎంపీ గోడం నగేష్, అధికారులు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో టీఏసీ సభ్యులు ఎస్. కృష్ణకుమార్, బూర రమేష్, కే. వినోద్‌కుమార్, కొండ ప్రభాకర్ గౌడ్‌తో పాటు వివిధ డివిజన్ల అధికారులు, బీఎస్ఎన్ఎల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












