Nirmal/Khanapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుకునే 'విజయ్ దివస్' ను ఖానాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, న్యాయవాది నరేంద్రనాథ్ మాట్లాడుతూ, ఈ యుద్ధం భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా 'విజయ్ దివస్' ను ఖానాపూర్లో ఘనంగా నిర్వహించారు. శత్రు దేశాన్ని గడగడలాడించిన ఈ యుద్ధం, కదన రంగంలో భారత సైన్యం వీరోచిత పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని న్యాయవాది నరేంద్రనాథ్ అన్నారు.
కార్గిల్లోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్థాన్ చేసిన కుట్రలను మన జవాన్లు తిప్పికొట్టారని ఆయన తెలిపారు. జులై 26, 1999, ప్రతీ భారతీయుడు మరిచిపోలేని రోజుగా అభివర్ణించారు. యావత్ దేశం 'జయహో భారత్' అంటూ నినదించిన రోజు ఇదేనని, ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అని అన్నారు. దాయాది దేశం పాకిస్థాన్ దురాక్రమణను తిప్పికొట్టి, మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు మన జవాన్లు.
మన భారత సైన్యం దేశానికి అందించిన సేవలకు శిరసు వంచి వారికి నమస్కరిస్తూ, ఆశ్రు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాది నరేంద్రనాథ్, మరికొందరు యువకులు ఘనంగా నివాళులు అర్పించారు.












