ఎర్రవల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
మండలం, గ్రామానికి చెందిన ఎం. ఉదయ్‌సాయి అనే యువకుడి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.5 లక్షల ఎల్ఓసీని మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
పేద కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండ కిడ్నీ మార్పిడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేత బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్ అలంపూర్, సెప్టెంబరు 4: పేద కుటుంబానికి వైద్య చికిత్స విషయంలో ప్రజా ప్రభుత్వం అండగా నిలిచిందని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్ అన్నారు. మండలం గ్రామానికి చెందిన ఎం. భగవాన్ జీ కుమారుడు ఎం. ఉదయ్‌సాయి ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీని మంజూరు చేసింది. మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన అంటే పేద, సామాన్య ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యమన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలు వైద్య ఖర్చుల భారం వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తోందని తెలిపారు. కిడ్నీ మార్పిడి వంటి ఖరీదైన వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం అందడం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. ప్రభుత్వం అందించిన రూ.5 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీతో ఉదయ్‌సాయి చికిత్సకు ఆర్థిక భారం కొంత తగ్గుతుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కుమారుడి వైద్య చికిత్స కోసం ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహాయం తమ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్‌కుమార్ బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ.. ఉదయ్‌సాయి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. వైద్య చికిత్సకు సంబంధించి భవిష్యత్తులో ఏమైనా అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.












