సారంగాపూర్ మండలంలోని పిండల్దరి గ్రామానికి చెందిన 28 సంవత్సరాల పెందుర్ దీప, అంబులెన్స్ లోనే నార్మల్ డెలివరీ ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఈ రోజు ప్రొద్దున 9:20 కి, పురిటి నొప్పులు ఎక్కువ అవడం తో, మార్గ మధ్యలో అంబులెన్సు ని ఆపి వైద్యుల సూచనల మేరకు నార్మల్ డెలివరీ జరిగింది.
దీంతో, ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత, ఆమెను MCH హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
తల్లి, మూడవ కాన్పులో మగ బిడ్డ పుట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆమెకు ముందుగా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
కుటుంబ సభ్యులు డాక్టర్స్ కు ధన్యవాదాలు తెలిపారు మరియు 108 సర్వీస్ ని అందించిన వారికి అప్రిసియేషన్ తెలిపారు.












