నిర్మల్ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం అంబేద్కర్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యతను, దాని ప్రయోజనాలను వివరించారు.
యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా, యోగా శిక్షకులు హాజరైన వారితో కలిసి వివిధ రకాల యోగాసనాలు వేశారు. ప్రతి ఆసనం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి వారు వివరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆచరిస్తున్నారని, ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
యోగ సాధనతో అనేక దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని శిక్షకులు తెలిపారు. ప్రతిరోజూ కొద్ది సమయం యోగాకు కేటాయించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఇఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, నోడల్ అధికారి సత్యనారాయణరావుతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది, శిక్షకులు, పట్టణవాసులు పాల్గొన్నారు.












