మంగళగిరి గ్రామీణం, 2026-06-05
మంగళగిరి నగరంలోని ఏయిమ్స్ వైద్యశాలలో అత్యవసర సమయాల్లోనూ బెడ్ దొరకడం కష్టతరంగా మారిందని, ఈ పరిస్థితి జర్నలిస్టులకే ఎదురైందని స్థానిక రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో అనారోగ్యానికి గురైన సివిఆర్ రిపోర్టర్ రమేష్ కు అత్యవసర వైద్యం అందించడంలో ఏయిమ్స్ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని బాధితులు తెలిపారు.

వైద్యం కోసం ఎదురుచూపు
వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురైన రమేష్ ను ఏయిమ్స్ కు తరలించగా, మొదట ఎమర్జెన్సీ డైరెక్టర్ కు ఫోన్ చేసినా స్పందన లేదని, మీడియా వ్యవహారాల సిబ్బందిని సంప్రదించగా ఓపి విభాగానికి వెళ్లాలని సూచించారని రిపోర్టర్లు తెలిపారు. ఓపి విభాగానికి వెళ్లగా, సమయం పడుతుందని, ప్రక్కన కూర్చోవాలని సిబ్బంది చెప్పారని, ఈలోగా రమేష్ కు వాంతులు ఎక్కువయ్యాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
పరిస్థితి విషమించడంతో, ఇతర రిపోర్టర్లు రమేష్ ను మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడి సిబ్బంది కూడా ఓపి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వైద్యం చేస్తామని చెప్పారని, అత్యవసర సమయాల్లోనూ ఇలా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. ఇది వైద్య సేవల తీరుకు అద్దం పడుతోందని వారు పేర్కొన్నారు.