ఆగ్రహం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది సమయపాలన లోపించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ సమయానికి వైద్య సిబ్బంది, అటెండర్లు, వార్డు బాయ్‌లు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో సమయపాలన ఏదీ? ఓపీ సమయానికి సిబ్బంది రాక.. రోగులకు తప్పని తిప్పలు అటెండర్లు, వార్డు బాయ్‌ల తీరుపై ప్రజల జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని వినతి ( కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది సమయపాలనపై రోగులు, వారి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సమయానికి వైద్య సిబ్బంది, అటెండర్లు, వార్డు బాయ్‌లు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన సమయంలో సేవలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. సిబ్బంది ఆలస్యంగా రావడంపై ప్రశ్నిస్తే వివిధ కారణాలు చెబుతున్నారని, అవసరమైన సందర్భాల్లో విధులు నిర్వహిస్తామని కొందరు సిబ్బంది పేర్కొంటున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది తీరుపై అసంతృప్తి అటెండర్లు, వార్డు బాయ్‌లు సమయానికి విధులకు హాజరు కాకపోవడం వల్ల రోగులను వార్డులకు తరలించడం, అవసరమైన సహాయం అందించడం వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే భయపడే పరిస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది హాజరు, విధుల నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఓపీ సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై దృష్టి పెట్టి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రజలు కోరుతున్నారు.












