బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
బోథ్ నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు శనివారం ఆడే గజేందర్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్యపరమైన ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నేరడిగొండ మండల కేంద్రంలో రాథోడ్ సంగీతకు రూ. 40,000/- మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు.
బోథ్ నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు శనివారం ఆడే గజేందర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ పట్టణానికి చెందిన రాథోడ్ సంగీతకు రూ. 40,000/- మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆడే గజేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణ సింగ్, పాక్స్ డైరెక్టర్ చట్ల ఉమేష్, బోథ్ మండల SC సేల్ అధ్యక్షులు అంజయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.












