మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 12 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులతో నలుగురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 12 కొత్త కేసులు నమోదయ్యాయి.
కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఈ కొవిడ్ పాజిటివ్ కేసులతో నలుగురు మృతి చెందారు. ముగ్గురు బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉండగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్-19 కేసులు బయటపడటంతో, కరోనావైరస్ తిరగబెట్టడం, మళ్లీ లాక్డౌన్ గురించి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 2020 నాటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్తున్నామా అనే ఆందోళన వారిలో టెన్షన్ పెంచుతోంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.












