आంధ్రప్రదేశ్, 16 July
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో తాజాగా 12 కోవిడ్ కేసులు నమోదవ్వగా, నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని అధికారులు తెలిపారు. జూన్ 26 నుంచి 12 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కోవిడ్ బారినపడి నలుగురు మృతి చెందారు. ముగ్గురు బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉండగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్-19 కేసులు బయటపడుతున్న నేపథ్యంలో, కరోనావైరస్ తిరిగి రావడం, మళ్లీ లాక్డౌన్ గురించి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 2020 నాటి తీవ్రమైన పరిస్థితిని మరోసారి ఎదుర్కొంటామా అనే ఆందోళన ప్రజలలో నెలకొంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు భరోసా ఇస్తున్నారు.












