మిర్యాలగూడ, జూలై 4
మిర్యాలగూడ మండలం ఆలగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.
మిర్యాలగూడ మండలం ఆలగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.
సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ముఖ్యంగా దోమల వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ నగేష్, ఆలగడప కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మొయీద్, ఎస్టీఎల్ఎస్ నాగిరెడ్డి, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.