బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీకి ప్రకృతి పరిరక్షణకు చేసిన కృషి గుర్తింపుగా జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంస పత్రం అందజేయబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి మరియు జిల్లా ఎస్పీ పాల్గొని సన్మానం చేశారు.
ప్రకృతి సంపదను కాపాడటానికి, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి, వృక్షారోపణ మరియు అవగాహన కార్యక్రమాలకు బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ చేసిన సేవలను గుర్తించి ఈ ప్రశంస పత్రం అందించబడింది.
సభ్యులు, భవిష్యత్తులో ప్రకృతి సంరక్షణ కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.












