హైదరాబాద్, జులై 05
హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తున్న వలస కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం 'వర్క్ సైట్ స్కూళ్లను' ప్రారంభించింది. నర్సింగిలోని పారిశ్రామిక ప్రాంతంలో మొదటి పాఠశాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ జి. శ్రీజన ప్రారంభించారు. విద్యాశాఖ, పురపాలక శాఖ, రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి.
హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మిస్తున్న వలస కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం వర్క్ సైట్ స్కూళ్లను ప్రారంభించింది. తొలుత నర్సింగిలోని పారిశ్రామిక ఏరియాలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ జి. శ్రీజన తాజాగా ఈ పాఠశాలను ప్రారంభించారు.
విద్యాశాఖ, పురపాలక శాఖ, రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలలో 37 మంది చిన్నారులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చదువుకుంటున్నారు. మొత్తం 53 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వీరిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తున్న వలస కార్మికుల పిల్లలే.
ఇక్కడ ఇంగ్లీష్, గణితం, హిందీతో పాటు ఆటలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, విరామ సమయాలు కూడా పాఠశాల నిర్వహణలో భాగమే. నిర్మాణ సైట్ల వద్దే తరగతులు నిర్వహించడం వల్ల పిల్లలు లేబర్ క్యాంపుల్లో నిర్లక్ష్యంగా తిరిగే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు పనిలో ఉండగా చిన్నారులు సురక్షితంగా చదువుకునే అవకాశం లభిస్తోంది.
ఇటీవల లేబర్ కాలనీల్లో చిన్నారులపై జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ పాఠశాలలు భద్రతా పరంగానూ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే దిశగా నార్సింగిలోని నవనామి, బీఎస్ ఆర్ డెవలపర్స్ నిర్మాణ ప్రాంగణాల్లో మరో రెండు వర్క్ సైట్ స్కూళ్లు సిద్ధంగా ఉన్నాయి.
భవిష్యత్తులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సుమారు 100 లేబర్ క్యాంపుల్లో ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.











