నిర్మల్ జిల్లా, సారంగాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా విద్యాబోధన ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు.
పాఠశాలలో వంటగది, స్టాక్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా హాస్టల్లో మరమ్మతులు, ప్రాంగణాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అత్యంత కీలకమని కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడేలా బోధన ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో డిఈవో భోజన, డిటిడిఓ అంబాజీ, తాసిల్దార్ సంధ్యారాణి, ఎంపిడిఓ లక్ష్మీకాంతరావు, ఎంపీఓ అజిత్ ఖాన్, గ్రామ సర్పంచ్ మల్లేష్, ప్రధానోపాధ్యాయులు అనూష, డిప్యూటీ హెచ్డబ్ల్యూఓ మంగీలాలాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











