తానూర్, జూలై 24
తానూర్ మండల కేంద్రంలోని విరలేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు కోరారు. ఈ ఉత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, హారతులు నిర్వహించనున్నారు.
తానూర్ మండల కేంద్రంలోని విరలేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు కోరారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ రాత్రి వేళల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, హారతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే శనివారాల్లో హనుమాన్ ఆలయం, ఆదివారాల్లో గుర్రం, సోమవారాల్లో ఏనుగు, మంగళవారాల్లో రథం, బుధవారాల్లో పల్లకి, గురువారాల్లో కాకడ హారతి వంటి విశిష్ట కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
శ్రావణ మాసంలో జరిగే ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.












