నిర్మల్, జూలై 28
నిర్మల్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీగిరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. ఈరోజు స్వామివారికి పంచామృత సేవ, కావడి సేవ, రథ సేవ, అన్నదాన సేవ వంటి పలు అద్భుతమైన సేవలు జరిగాయి. నిర్మల్ పట్టణంతో పాటు అనేక గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, స్వామివారికి విశేష పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ గురుమాత రాజరాజేశ్వరి దేవి, శ్రీశ్రీ వీరనారాయణ స్వామి, ఆయిట్ల నరేష్, చింతపండూ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఉద్దేశించి స్వామివారి మహిమలు, గుడి ప్రాముఖ్యత గురించి శ్రీశ్రీ వీరనారాయణ స్వామి వివరించారు. ఈరోజు ఆలయం తరఫున అన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆలయ కమిటీ: శ్రీ గిరి క్షేత్రం, విశ్వనాథ్ పెట్, నిర్మల్.