రామన్నపేట, 2026-06-05
వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో పడకంటి మొటాటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంఘ భవనం వద్ద గల మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా బస్టాండ్ వద్ద గల పోచమ్మ తల్లి వద్దకు చేరుకున్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు
పోచమ్మ తల్లి చుట్టూ ప్రదక్షిణలు చేసి, గంపలో తెచ్చిన అన్నం, బెల్లమన్నం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి, బండారు వేసి, కల్లుసాక పోసి, పుట్నాలు, బెల్లం, ఓమ మిశ్రమంతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించారు. పోచమ్మ, గుండేలవ్వ తల్లి కోసం గొర్రెలను తల్లి సన్నిధిలో బలిచ్చారు. పొట్టేలు జత ఇవ్వగానే పులోరియా, పులోరియా అంటూ నినదించారు.
సంప్రదాయ ఆచారం
ఈ సందర్భంగా పడకంటి మొటాటి రెడ్డి సంఘం అధ్యక్షుడు పెద్దోళ్ల బాపురెడ్డి మాట్లాడుతూ, ఆషాడ మాసంలోని ఆదివారం పోచమ్మ పండుగను నిర్వహించుకోవడం పూర్వం నుండి వస్తున్న సంప్రదాయ ఆచారమని తెలిపారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, సమస్త జీవకోటి ప్రాణులన్నీ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కోళ్లకాడు కంకణాల రవి, మాజీ అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్, పడకంటి బాపురెడ్డి, పంచాక్షర్ రెడ్డి, సాయరెడ్డి, మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మధు రెడ్డి, చిన్న గంగారెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.