Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సోన్ మండలంలోని పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సోన్ మండలంలోని పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
పుష్కరాల నాటికి ఘాట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. గత పుష్కరాల్లో నమోదైన భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈసారి అంచనాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. చేపట్టే పనులు నాణ్యతతో, మన్నికగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
పుష్కర ఘాట్లకు చేరుకునే మార్గాల్లో స్పష్టమైన సూచికల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగిన పార్కింగ్ సౌకర్యాలు, రాకపోకలకు అనువైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే భక్తుల భద్రత, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, లైటింగ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ అనిల్, తహసీల్దార్ సంతోష్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












